Unstoppable movie review and rating
Unstoppable movie review and rating !!!
“అన్ స్టాప్పబుల్” మూవీ రివ్యూ & రేటింగ్ !!!
నటీనటులు: విజె సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సా ఖాన్, బిత్తిరి సత్తి, పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, రాజా రవీంద్ర, రఘు బాబు, విక్రమాదిత్య తదితరులు
దర్శకులు : డైమండ్ రత్న బాబు
నిర్మాతలు: రంజిత్ రావు
సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: వేణు మురళీధర్ వి
ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో బిగ్ బాస్ విన్నర్ సన్నీ అలాగే ప్రముఖ కమెడియన్ సప్తగిరి నటించిన చిత్రం “అన్ స్టాప్పబుల్”. మరి ఓ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఎంతవరకు ఎంటర్టైన్ చేసిందో సమీక్షలో చూద్దాం రండి.
కథ :
ఇక ఈ సినిమాలో లైన్ లోకి వస్తే..కోహినూర్ కళ్యాణ్(విజె సన్నీ) అలాగే జిలాని రామదాస్(సప్తగిరి) తన చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుని ఓ క్రికెట్ బెట్టింగ్ లో అయితే పోగొట్టుకుంటారు దీనితో డబ్బులు కోసం తమ మరో ఫ్రెండ్ హనీ బాబు(షకలక శంకర్) సాయం కోరగా తను పొరపాటున ఆ డబ్బులు జ్ఞ్యానవేల్ రాజా అలియాస్ ఖాదర్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. తీరా కట్ చేస్తే ఈ ఖాదర్ ఓ పేరుమోసిన డాన్. మరి ఈ పరిస్థితి నుంచి కళ్యాణ్ జిలానీలు ఆ డబ్బులు ఎలా రాబట్టుకుంటారు? జిలాని తన చెల్లి పెళ్లి చేశాడా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
రీసెంట్ గా ఏటీఎం సిరీస్ లో కనిపించి మెప్పించిన వీజే సన్నీ ఈ చిత్రంలో కూడా మంచి నటనతో అయితే ఆకట్టుకుంటాడు. తన లుక్స్, డైలాగ్ డెలివరీ బాగుంది. అలాగే తన కామెడీ టైమింగ్ సహా కొన్ని మాస్ షేడ్స్ సినిమాలో బాగున్నాయి.
ఇక తన ఫ్రెండ్ గా నటించిన సప్తగిరి తన మార్క్ కామెడీ తో ఆకట్టునే ప్రయత్నం చేసాడు. అలాగే పెర్ఫామెన్స్ పరంగా కోడోత్ మంచి నటన కనబరిచాడు. ఇక మిగతా నటులు పోసాని బిత్తిరి సత్తి లు కూడా తమ వరకు నవ్వించే ప్రయత్నం చేశారు. అలాగే సినిమాలో మ్యూజిక్ కొంచెం ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది.
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. భీమ్స్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇంకా ఎడిటింగ్ లో అయితే కొన్ని అనవసర సీన్స్ తీసేయాల్సింది. ఇక దర్శకుడు డైమండ్ రత్నబాబు ఆకట్టుకునే ఎంటర్టైనర్ చేయడంలో మెప్పించారు. ఈ సినిమాలో కామెడీ సీన్స్ ను పండించడంలో పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేసేలా తాను తీర్చి దిద్ది సక్సెస్ అయ్యారు.
ఇక మొత్తంగా చూసినట్టు అయితే కామెడీ ఎంటర్టైనర్ అంటూ వచ్చిన ఈ “అన్ స్టాప్పబుల్” అందరిని మెప్పిస్తుంది. ఫ్యామిలీ అందరూ కలిసి చేసే మంచి సినిమా ఇది.
రేటింగ్: 3/5