Telugu Horror movie Padmasri (2022) Review and Rating
Telugu Horror movie Padmasri (2022) Review and Rating
కామెడీ బేస్డ్ యాక్షన్ ఓరియెంటెడ్ హారర్ మూవీ “పద్మశ్రీ” రివ్యూ
నటీనటులు: జ్యోతి (టైటిల్ రోల్), కిషోర్ కుమార్, కనికా ఖన్నా, రావిపల్లి సంధ్యారాణి, ఎస్. ఎస్ పట్నాయక్, మరుపల్లి సతీష్, హర్ష కశ్యప్, కాళీ చరణ్, ఫన్నీ రాజు, డా. ప్రవీణ్, చక్రవర్తి, జయ, రమ్య శ్రీ, AV రమణ మూర్తి, పూజారి లక్ష్మణ రావు తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: ఎస్. ఎస్ పిక్చర్స్
రచన, దర్శకత్వం: ఎస్. ఎస్ పట్నాయక్
నిర్మాత: సదాశివుని శిరీష
సహ నిర్మాతలు: మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ, PVS రామ్మోహన రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: pvg కృష్ణంరాజు, M. నర్సింగరావు
ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు
ఎడిటింగ్ : కంబాల శ్రీనివాస రావు
ఆర్ట్: మణిపాత్రుని నాగేశ్వర రావు
ఫైట్స్: దేవరాజు మాస్టర్
సంగీతం: జాన్ పోట్ల
కొరియోగ్రాఫర్స్: వెంకట్, తారక్
పి ఆర్.ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు
కరోనా పరిస్థితుల్లో పెద్ద సినిమాలే రిలీజ్ చేయడానికి వెనకడుగేస్తుండ గా..కథ, కంటెంట్‌పై ఉన్న నమ్మకం తో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్న చిత్రమే “పద్మశ్రీ”.ప్రముఖ మెజీషియన్, హిప్నాటిస్ట్ బేతా శ్రీనివాసరాజు సమర్పణ లో ఎస్. ఎస్ పిక్చర్స్ బ్యానర్‌పై జ్యోతి టైటిల్ రోల్ లో ఎస్. ఎస్ పట్నాయక్ రచన, దర్శకత్వంలో సదాశివుని శిరీష నిర్మాతగా మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ, PVS రామ్మోహన రావు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న కామెడీ బేస్డ్ యాక్షన్ ఓరియెంటెడ్ హారర్ మూవీ “పద్మశ్రీ” .జనవరి 22న ఎంతో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూలో చూద్దాం పదండి.
కథ:
డాక్టర్ గా ఎంతో మందికి సేవలు చేస్తూ పోలీస్ ఆఫీసర్ అయిన తన భర్త పిల్లలతో హ్యాపీగా బతుకుతున్న డాక్టర్ పద్మశ్రీ అనూహ్యంగా ఒకరోజు ఉరేసుకొని చనిపోతుంది.ఆ తరువాత ఆ ఇంట్లో వింత వింత శబ్దాలు వస్తున్నాయని ఆ ఇంటి వాచ్ మ్యాన్ స్వామీజీని ఆశ్రయిస్తాడు. ఈ ఇంట్లో చనిపోయిన పద్మశ్రీ ఆత్మ తిరుగు తుందని చెప్పి పద్మశ్రీ ఊరేసుకున్న రూంను మత్రించి తాళం వేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ రూంను ఓపెన్ చేయవద్దని చెప్పి ఎవరికైనా రెంట్ కి ఇస్తే మీకు తోడుగా వుంటారని చెప్పి వెళతాడు స్వామీజీ. జీవితంలో తమ కళలను నెరవేర్చు కొని తమ గర్ల్ ఫ్రెండ్స్ తో సెట్ అవ్వాలనుకొన్న కిషోర్,హర్ష, చక్రి,,డైరెక్టర్ కళారత్న లు వెంకటలక్ష్మి ఉమెన్స్ హాస్టల్ లో వేర్వేరు రూమ్స్ లో వుంటారు. వీరికి హాస్టల్ వాతావరణం పడక పోవడంతో ఒకరి ద్వారా ఒకరు పరిచయం తో సెపరేట్ రూమ్ లో వుందామని రూమ్ వెతికే క్రమంలో పద్మశ్రీ నివాసంలో రెంట్ కు దిగుతారు.వాచ్ మ్యాన్ ఓపెన్ చెయ్యద్దని చెప్పిన రూమ్ ను ఓపెన్ చేస్తారు.ఫ్రెండ్స్ లేని టైంలో సరదాగా గడపచ్చు అని ఇంటికి తీసుకొచ్చిన గర్ల్ ఫ్రెండ్ లోకి పద్మశ్రీ ఆత్మ ప్రవేశించి తనలో ఉన్న కోపాన్ని వీరిపై ప్రదర్శిస్తుంది. ఈ నలుగురిపైనే ఎందుకు పగ పట్టింది? పద్మశ్రీ చనిపోవడానికి కారకులు ఎవరు.ఆమె ఎందుకు చనిపోయింది? వీరికి పద్మశ్రీ కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెలుసు కోవాలంటే “పద్మశ్రీ” సినిమా చూడవలసిందే..
నటీనటుల పనితీరు:
నూతన నటి అయిన జ్యోతి పద్మశ్రీ పాత్రలో డాక్టర్ గా, పిల్లల తల్లిగా సహజ నటనతో నటిస్తూ.. దెయ్యం గా నటించి అందరినీ బయపెట్టింది.సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా కిషోర్, సివిల్ ప్రిపేర్ అయ్యి కలెక్టర్ అవ్వాలనుకునే పాత్రలో హర్ష ,కొరియర్ బాయ్ గా చక్రి, పెద్ద డైరెక్టర్ అవ్వాలనే తపన ఉన్న కళారత్న పాత్రలో చిత్ర దర్శకుడు ఎస్.ఎస్ పట్నాయక్ లు వీరంతా సీనియర్ నటుల్లా చక్కని నటనతో నటిస్తూ కీలక సన్నివేశాల్లో తన ఎమోషన్స్ కి తగ్గట్లుగా నటించి మెప్పించారు. కధ కీలక మలుపు తిరిగే క్యారెక్టర్ లో పోలీస్ ఆఫీసర్ గా డాక్టర్ ప్రవీణ్ చాలా బాగా చేసాడు. చక్రి గర్ల్ ఫ్రెండ్ గా మంగీ,కిషోర్ గర్ల్ ఫ్రెండ్ గా జాహ్నవి తమ క్యారెక్టర్ లలో చాలా మంచి పెర్ఫార్మన్స్ చేశారు.ఇంకా ఈ చిత్రంలో నటించిన తదితర నటీ నటులంతా వారికిచ్చిన పాత్రలలో నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
ప్రతి పనిలో తప్పటడుగులు వేయడం సహజం కానీ ఆ తప్పటడుగులు తప్పుటడుగులుగా మారకుండా చేసే ప్రయత్నమే పద్మశ్రీ .కొంతమంది వ్యక్తుల ద్వారా పద్మశ్రీ అనే ఆమె బాధితురాలు గా ఎలా మారింది.ఆ బాధితు రాలుగా మారిన పద్మశ్రీ వారిని శిక్షించించాలా.. వారు చేసే తప్పులను సరిదిద్దాలా..లేక పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అనే మంచి కథను సెలెక్ట్ చేసుకొని పగ ప్రతికారాలు కాదు మనిషిలో మార్పు రావాలనే పాయింట్ తో ప్రేక్షకుడికి రీచ్ అయ్యేలా పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకుని.. కథ.. కథనాలను నడిపించి సక్సెస్ సాధించాడు దర్శకుడు ఎస్. ఎస్ పట్నాయక్.ఈ కథ రెగ్యూలర్ స్టోరీ అయినా అనుభవం ఉన్న డైరెక్టర్‌లా సినిమాను కొత్తగా ప్రజెంట్ చేశాడు.లవ్, ఎమోషనల్ సీన్స్ , హార్రర్, థ్రిల్లర్స్, కామెడీ తో పాటు కథలో ట్విస్టులు బావున్నాయి.సంగీత దర్శకుడు జాన్ పోట్ల మ్యూజిక్ బాగుంది. “ఎట్టనున్నదో నా మంగీ ఎటి చేస్తుందో నా మంగీ” పాట అలాగే సినిమా ఇండస్ట్రీ పై బాసంగి సురేష్ కుమార్ రాసిన “ఒక్కఛాన్స్” అనే పాటలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్థాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటో గ్రాఫర్ మేకల నర్సింగరావు పనితీరు బాగుంది. సీన్స్ రిచ్‌గా అనిపిస్తాయి. కంబాల శ్రీనివాస రావు ఎడిటింగ్ పనితీరు బాగుంది. సంధ్యారాణి పోరాట సన్ని వేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి.ఎస్. ఎస్ పిక్చర్స్ పతాకంపై సదాశివుని శిరీష ఈ సినిమాను ఏక్కడా రాజీపడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. “పద్మశ్రీ” సినిమాను పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయచ్చు.
రేటింగ్: 3/5