Nee Jathaga Telugu Movie Review and Rating
నీ జతగా మూవీ రివ్యూ
శ్రీ సుబద్ర క్రియేషన్స్ బ్యానర్ పై, భరత్ బండారు, జ్ఞానేశ్వరి, నయని పావని, ప్రవణ్, బాలరాజు పులుసు, సునీల్ రాజ్,దీపక్ దగని, దీపు సల్ల ,మెహబూబ్ భాషా, లిపికా,బాషా తదితర తారాగణంతో భమిడిపాటి వీర దర్శకత్వంలో రామ్ బి నిర్మించిన సినిమా “నీ జతగా”. ఈ సినిమా సెప్టెంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
నటీనటులు:
భరత్ బండారు, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, సాయిరాం బి.ఏస్,రఘవీరా చారి,నయని పావని, ప్రవణ్, బాలరాజు పులుసు, సునీల్ రాజ్,దీపక్ దగని, దీపు సల్ల ,మెహబూబ్ భాషా, లిపికా,బాషా తదితరులు
బ్యానర్ :శ్రీ సుబంద్రా క్రియేషన్స్
ప్రొడ్యూసర్ :రామ్ బి
డైరెక్టర్ :భమిడిపాటి వీర
లిరిక్స్ :అనంత్ శ్రీరామ్, రామ్. బి
మ్యూజిక్ :పవన్
సింగర్ : అనురాగ్ కులకర్ణి
డి ఓ పి :కె వి శ్రీధర్
ఎడిటర్ :ప్రభు
కథ:
హిమాన్షు (భారత్ బండారు) తన ఫ్రెండ్ అయిన పావని అనే అమ్మాయితో కలిసి ట్రెక్కింగ్ కి వస్తాడు, అదే సమయంలో సహస్ర ( జ్ఞానేశ్వరి) తన బాయ్ ఫ్రెండ్ తో కలసి ట్రెక్కింగ్ కి వస్తుంది. ఈ క్రమంలో సహస్ర తప్పిపోతుంది. ఆ అమ్మాయిని వెతికే క్రమంలో హిమాన్షు తన లవ్ స్టోరీని చెబుతాడు. హిమాన్షు, సహస్ర ఒకరినొకరు ప్రేమించుకుంటారు. చివరికి వారు ఎలా కలుసుకున్నారు ? ఈ ట్రెక్కింగ్ లో వారికి ఎదురైన అనుభవాలు ఏమిటి అనేది తెలియాలంటే నీ జతగా సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
అందరూ కొత్తవారు ఈ సినిమాలో నటించారు, కొత్తవారైనప్పటికి బాగా నటించి మెప్పించారు. ముఖ్యంగా భారత్ బండారు, జ్ఞానేస్వరి, సాయిరాం, రఘువీరాచారి, పావని వారి పాత్రల్లో ఒదిగిపోయారు. దర్శకుడు భమిడిపాటి వీర యూత్ ఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించారు. ఎక్కడా బోరింగ్ లేకుండా అందరూ కలిసి చూడదద్ద సినిమాను తీశారు. దర్శకుడిగా అతనికి మంచి భవిషత్తు ఉంది.
నిర్మాత రామ్.బి సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. అంతే కాకుండా ఆయన ఈ సినిమాలో రెండు పాటలకు సాహిత్యం అందించటం విశేషం. చిత్ర నిర్మాణ విలువలు బావున్నాయి. నిర్మాతగాను, గేయ రచయిత గాను రామ్.బి రాణించారు, అలాగే అనంత్ శ్రీరామ్ లిరిక్స్ గురించి ప్రేతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అద్భుతంగా ఉన్నాయి. పవన్ అందించిన నేపధ్య సంగీతం సినిమాను నెక్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళింది. కెవి.శ్రీధర్ సినిమాటోగ్రఫీ చాలా నేచురల్ గా ఉంది. అందమైన లొకేషన్స్ ను బాగా చూపించాడు. ప్రవన్, బాలరాజు పులుసు, దీపక్ దగని, సునీల్ రాజ్, దీపు సళ్ళ, లిపిక ఘోష్, మరియు మహబూబ్ బాష తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
నీ జతగా సినిమా ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్, అలాగే ఫ్యామిలీ అందరూ కూడా కలిసి చూడదగ్గ ఎలిమెంట్స్ ఉన్నాయి. సరదాగా సాగే ఈ సినిమాలో మంచి సంగీతంతో పాటు మంచి కథ కథనాలు ఉన్నాయి. ప్రేక్షకులకు మంచి సినిమాను అందించాలని చేసిన నిర్మాత రామ్. బి మరియు దర్శకుడు వీర ప్రయత్నం పూర్తిగా ఫలించింది.
చివరిగా: నీ జతగా అందరిని సరదాగా ఎంటర్టైన్ చేస్తుంది.
రేటింగ్: 3/5
Nee Jathaga Telugu Movie 2021 Review and rating
Director: Bamidipati Veera
Producer:Ram B (Sri Vashista)
Production House: Sri Subhadra Creations
Music : PAVAN
Background Score: SD Abu